
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు
చిరుధాన్యాలతో ఆరోగ్యం చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఎంపీడీఓ రాములు పేర్కొన్నారు.
● కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం
● కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: జిల్లాలో ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం నగరం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 1.52 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారని, 3,84,800 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. 129 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టినుట్లు వివరించారు. ధాన్యం విక్రయించిన 24 గంటల లోపే ట్యాబ్ ఎంట్రీ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్డీఓ శ్రీనివాస్, డీఎస్‌ఓ సుదర్శన్, సివిల్ సప్లయ్ డీఎం మోహన్ కృష్ణ,, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, డీసీఓ నాగార్జున, లీగల్ మెట్రోలజీ అధికారి ప్రవీణ్ కుమార్, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.
ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం
కొడంగల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న వారితో బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ సమావేశమయ్యారు. ఆలయ విస్తరణ కోసం సుమారు 8వేల గజాల భూమి సేకరించడం జరిగిందన్నారు. ఇళ్ల విలువను బట్టి నష్టపరిహారం తోపాటు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించడం జరుగుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, డీఆర్‌ఓ మంగీలాల్, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, ఆలయ ఈఓ రాజేందర్ రెడ్డి, తహసీల్దార్ రాంబాబు, జీ సెక్షన్ సూపరింటెండెంట్ నఫీజ్ పాతిమా తదితరులు పాల్గొన్నారు.