
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం
● కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయింది
● ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
పరిగి: ఎన్నికల హామీలను అమలు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. దోమ మండలం గూడూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బుధవారం మాజీ ఎమ్మెల్యే నివాసంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విసుగొచ్చిందన్నారు. ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ పాలను గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ పనితీరు నచ్చక ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. హామీలను నెరవేర్చేంత వరకు బీఆర్‌ఎస్ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస సత్తా ఎంతో చూపుతామన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఎన్నికలను ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. ఏ గ్రామానికి వెళ్లిన బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధే కనిపిస్తోందని అన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. ఇతర పార్టీల్లోంచి బీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొప్పుల నాగిరెడ్డి, దోమ మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం, నాయకులు రఘుమోహన్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.