
బషీరాబాద్ ఎస్‌ఐని సస్పెండ్ చేయాలి
● దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేస్తే బాధితుడిపై కేసు పెడతారా?
● న్యాయం జరిగే వరకు
ఆందోళన చేస్తాం
● రాష్ట్ర దివ్యాంగుల సంఘం
అధ్యక్షుడు జంగయ్య
బషీరాబాద్: దాడి చేసిన వ్యక్తులపై అర్ధరాత్రి 100 కాల్ చేసి ఫిర్యాదు చేస్తే బషీరాబాద్ పోలీసులు బాధితుడిపై కేసు పెట్టడం విడ్డూరంగా ఉందని దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాల జంగయ్య పేర్కొన్నారు. ఎస్‌ఐ నుమాన్‌అలీని వెంటనే విధుల్లో నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేందటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. మంగళవారం బాధితులైన సిహెచ్ రాజు, అర్చన దంపతులు, దివ్యాంగులతో కలిసి బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దామర్‌చెడ్ గ్రామంలో సెప్టెంబర్ 30 అర్ధరాత్రి బోయిని వెంకటయ్య అనే వ్యక్తి రాజు, అర్చన దంపతులను దూశిస్తూ దాడి చేశాడని, అదే రోజు రాత్రి 100కి కాల్ చేసి ఫిర్యాదు చేసినట్లు, మరునాడు మధ్యాహ్నం కూడా కేసు పెట్టే వరకు స్పందించలేదని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంలో దాడి చేసిన వ్యక్తితో పోలీసులు కుమ్మకై ్క బాధితులపై కేసులు పెట్టి తమ నైజాన్ని చాటుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్లులేని రాజు ఎలా దాడి చేస్తాడని ప్రశ్నించారు. ఈ కేసులో సాక్షాలు తారుమారు చేసి రాజుకుటుంబంపై పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎస్‌ఐను సస్పెండ్ చేసేవరకు వదలబోమని జంగయ్య
హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, జిల్లా కార్యదర్శి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ చారి, మండల అధ్యక్షుడు ద్యావరి నర్సిములు, నాయకులు విజయ్‌కుమార్, నర్సిములు, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి కిష్ట్ర, మండల అధ్యక్షుడు కొనగేరి నర్సిములు, అంజిలప్ప, కిష్టప్ప, సాయిలు, జర్నమ్మ, రవికుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.