
విభజన హామీలు అమలు చేయాలి
కొడంగల్: కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయాలని రివాల్యూషనరి విద్యార్థి సంఘం (ఆర్‌ఎస్‌యూ) జాతీయ అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కొడంగల్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాల విభజన సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు నిధులు, నియామకాల్లో సమాన న్యాయంతో పాటు రెండు ప్రాంతాల అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం నిధులు కేటాయించడంలో జాప్యం చేస్తుందని విమర్శించారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను ఓటర్లుగానే చూస్తున్నారని విమర్శించారు. ఆర్‌ఎస్‌యూ ఆధ్వర్యంలో ఢిల్లీ వేదికగా రెండు రాష్ట్రాల విద్యార్థులతో కలిసి ఆందోళన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు భీమరాజు, శ్రీనివాస్, మహేశ్, వెంకటేశ్, అశోక్, రాము తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఎస్‌యూ జాతీయ అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి