
అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు
అనంతగిరి: లండన్ నగరంలో బీఆర్ అంబేడ్కర్ నివసించిన గృహాన్ని మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సందర్శించారు. అంబేడ్కర్ జ్ఞాపకార్థం ఆయన నివసించిన ఇంటని మ్యూజియంగా మార్చారు. అక్కడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఉపయోగించిన లైబ్రరీని, పడక గదిని, ఫొటో గ్యాలరీని, వినియోగించిన వస్తువులను సందర్శించారు. విజిటర్స్ పుస్తకంలో తన అనుభవాలను రాశారు. ఈ ఇంటిని సందర్శించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వీ నర్సింహా చార్యులు, స్పీకర్ ఓఎస్డీ పీ వెంకటేశం, అధికారులు ఉన్నారు.