
పార్టీ కోసం శ్రమించిన వారికే పదవులు
పరిగి: కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించిన వారికే పదవులు దక్కుతాయని ఏఐసీసీ జిల్లా ఇన్‌చార్జ్ సూరజ్‌సింగ్ ఠాగూర్ అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు సూచించిన నాయకులకే పదవులు వరిస్తాయని తెలిపారు. పార్టీ కోసం పని చేసిన వారి జాబితా తమ వద్ద ఉందన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కలిసికట్టుగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ నాయకులు బెల్లయ్య నాయక్, పీసీసీ ఉపాధ్యక్షుడు నీలిమ, వేణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.