
బంద్‌ను విజయవంతం చేద్దాం
అనంతగిరి: బీసీ రిజర్వేషన్ల సాధనకు ఈ నెల 18న తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్ అన్నారు. సోమవారం వికారాబాద్ క్లబ్ ఫంక్షన్‌హాల్‌లో ఆయా పార్టీల బీసీ ముఖ్యనాయకులు, ఆయా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగరి యాదవ్ మాట్లాడుతూ.. బీసీలంతా సంఘటితమై ఏకతాటిపైకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిసె లక్ష్మణ్, విద్యా మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు, శ్రీనివాస్‌గౌడ్, సత్యనారాయణగౌడ్, లక్ష్మణ్, శేఖర్, రమేశ్, అంజయ్య, సురేందర్‌బాబు, అశోక్, విజయ్‌కుమార్, ఉమాశంకర్, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జిల్లా
అధ్యక్షుడు యాదగిరి యాదవ్