
కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు
బీజేపీ జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకటేశ్
తాండూరు టౌన్: 42శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకటేశ్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. బీఆర్‌ఎస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, బీజేపీపై బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు రాజ్యాంగం అంటేనే గౌరవం లేదని విమర్శించారు. రిజర్వేషన్ సాధన కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ప్రకారం తమిళనాడు ప్రభుత్వం అనుసరించిన తీరును, తెలంగాణ రాష్ట్రంలో కూడా పాటించాలని పేర్కొన్నారు. ఇప్పటికై నా ఇరు పార్టీలు బురద చల్లడం మానేయాలని సూచించారు.
ఈవీఎంల గోడౌన్ పరిశీలన
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్‌లోని ఈవీఎంల గోడౌన్‌ను శనివారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన నిర్వహించారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎంల గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తును పరిశీలించారు. రాజేంద్రనగర్ తహసీల్దార్, వేర్ హౌస్ ఇన్‌చార్జి రాములు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.