
హర్యానా డీజీపీని అరెస్ట్ చేయాలి
పరిగి: హర్యానా ఐపీఎస్ అధికారి వై పూరన్‌కుమార్ ఆత్మహత్యకు కారణమైన ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజిత్‌సింగ్‌ను వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం వెంకటయ్య డిమాండ్ చేశారు. శనివారం పరిగి పట్టణ కేంద్రంలో దళిత ప్రజా సంఘాల నేతలతో కలిసి అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పలువురు సీనియర్ అధికారులు కుల వివక్ష, మానసిక వేధింపులు భరించలేక మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత ఐపీఎస్ అధికారి వై.పూరన్‌కుమార్ కూడా వేధింపులు భరించలేకే చండీగఢ్‌లోని ఇంట్లో సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ఎనిమిది పేజీలతో కూడిన సూసైడ్ నోట్‌లో ఎవరెవరు వేధించారో రాశారని పేర్కొన్నారు. అందులో రిటైర్డ్ అధికారుల పేర్లు కూడా ఉన్నాయని, వారందరిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలుగు రాష్ట్రాలతో పాటు హర్యానా రాష్ట్రంలో సైతం ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య