
బీసీలపై కేంద్ర ప్రభుత్వం కుట్ర
పరిగి: బీసీలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్‌కృష్ణ, జాతీయ కార్యదర్శి హన్మంతు ముదిరాజ్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసిందని, ఈ బిల్లును కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఇదే అంశంపై పరిగి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కొడంగల్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన బిల్లును కేంద్రానికి పంపితే ఆమోదం తెలపకుండా అన్యాయం చేసిందన్నారు. ఆ బిల్లును వెంటనే ఆమోదింపజేయాలన్నారు. కార్యక్రమంలో నాయ కులు సత్యనారాయణ, శ్రీనివాస్, నర్సింహులు, వెంకటేశ్వరస్వామి, గోపాల్, నరేందర్, మైపాల్ తదతరులు పాల్గొన్నారు.