
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలు తీసుకోండి
● ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల డిమాండ్
● తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
తాండూరు టౌన్: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బుధవారం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కమాల్ అతర్ మాట్లాడుతూ.. అక్టోబర్ 2వ తేదీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజాసింగ్ మహ్మద్ ప్రవక్త పట్ల, ముస్లింల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఆయన వ్యాఖ్యలు యావత్ ముస్లింలకు బాధ కలిగించేవిగా ఉన్నాయన్నారు. అంతేకాకుండా మత విద్వేశాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పట్టణ సీఐ సంతోష్ కుమార్‌కు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు బాసిత్ అలీ, అబ్దుల్ సలీం, అబ్దుల్ ఖవి, అబ్దుల్ అహద్, యూనస్, ఖయ్యూమ్ అతర్, సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.