
పాఠశాలలో పాముల కలకలం
అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్
అనంతగిరి: సమాచార హక్కు చట్టం – 2005పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత తీసుకురావడం, అధికారులు జవాబుదారీగా వ్యవహరించడానికి ఈ చట్టం ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని సరైన విధంగా, నిర్ణీత సమయంలో ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మంగీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, డిప్యుటీ కలెక్టర్లు(ట్రైనీ) చంద్రకిరణ్, పూజ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ యాదగిరి
తాండూరు టౌన్: దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా దుకాణాల ఏర్పాటుపై విధించిన నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ యాదగిరి అన్నారు. బుధవారం పట్టణంలోని బాణసంచా దుకాణ యజమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వారు ముందుగా లైసెన్సు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన ఎన్‌ఓసీ పొందాలన్నారు. నివాస ప్రాంతాల్లో షాపులు ఏర్పాటు చేయడానికి వీలు లేదన్నారు. ఎక్కడైనా ఒకే చోట అన్ని దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జనావాసాల మధ్య టపాకాయలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఇన్‌చార్జ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వెంకటయ్య, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: జిల్లాలోని 59 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విజయ్‌భాస్కర్ తెలిపారు. బుధవారం ఎకై ్సజ్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 6 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉందన్నారు. జిల్లాలోని పారిశ్రామిక వేత్తలు, హోటల్, రెస్టారెంట్ యజమానులు, వ్యాపారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
హయత్‌నగర్: వ్యవసాయ పరిశోధనల ఫలితాలను రైతులకు అందించాలని, వ్యవసాయ డిజిటల్ యాప్ వినియోగంపై వారికి అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉష సూచించారు. బుధవారం హయత్‌నగర్ కృషి విజ్ఞాన కేంద్రంలో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ బయోసైన్స్ ఆధ్వర్యంలో ఆధునిక వ్యవసాయం, చీడపీడల యాజమాన్యంపై అన్నదాతలకు శిక్షణ ఇచ్చారు.