
గృహిణి అదృశ్యంపై కేసు నమోదు
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా గుడిపల్లికి చెందిన గజ్జల శ్రీకాంత్ రెడ్డి అతని భార్య సంధ్యారాణి(32) పిల్లలతో కలిసి జీవనోపాధి నిమిత్తం రెండు నెలల క్రితం తుక్కుగూడకు వలస వచ్చి కర్రీ పాయింట్‌ను నడుపుతున్నారు. ఈ నెల 1వ తేదీన ఎల్లారెడ్డిగూడలోని సోదరుడి ఇంటికి వెళ్లిన సంధ్యారాణి 7వ తేదీన తుక్కుగూడ వచ్చానని పేర్కొని, ఇంటికి మాత్రం వెళ్లలేదు. తిరిగి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళనకు గురైన భర్త ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.