కాపురానికి రావడం లేదని.. | - | Sakshi
Sakshi News home page

కాపురానికి రావడం లేదని..

Oct 9 2025 8:03 AM | Updated on Oct 9 2025 8:03 AM

కాపుర

కాపురానికి రావడం లేదని..

రెండో భార్యను హత్య చేసిన భర్త

క్షేత్రస్థాయి పర్యటన

కుల్కచర్ల: విద్యార్థులకు అర్థమయ్యే విధానంలో పాఠ్యాంశాలు బోధించాలని ఉపాధ్యాయులు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. మండలంలోని రాంనగర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్‌, గోప్యానాయక్‌తండా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు రజిని, ఖలేదాబేగం, స్వప్న బుధవారం తమ విద్యార్థులతో కలిసి సమీపంలోని పంట పొలాలు, దేవాలయాల వద్దకు తీసుకెళ్లి పాఠ్యాంశాలు బోధించారు. విద్యార్థులకు సులభతరంగా పాఠాలు చెప్పడంతో పాటుగా ప్రకృతిను ఆస్వాధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో బోధనోపకరణాలను ఉపయోగించి పాఠాలు చెప్పడంపై ఆయా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్‌ మల్లమ్మ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్‌ వరలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

చేవెళ్ల: కాపురానికి రావడం లేదనే కక్షతో భార్యను కడతేర్చాడో భర్త. మాట్లాడుకునేందుకు తీసుకెళ్లి బండ రాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని ఆలూరు అనుబంధ గ్రామమైన వెంకన్నగూడకు చెందిన వానరాసి జంగయ్య బతుకుదెరువు నిమిత్తం రాంచంద్రాపురంలో ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలున్నారు. ప్రస్తుతం రాంచంద్రాపురంలో మొదటి భార్యతో కలిసి ఉంటున్నాడు. రెండో భార్య రజిత(30) పటాన్‌చెరులో ఇళ్లలో పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. గత రెండేళ్లుగా వీరి మధ్య మనస్పర్థలు నెలకొనడంతో రజిత దూరంగా ఉంటోంది. కాపురానికి రావాలని ఎన్నిసార్లు మాట్లాడటానికి ప్రయత్నించినా ఆమె నిరాకరించింది. ఎట్టకేలకు తన తల్లి వద్ద మాట్లాడుకుందామని చెప్పిన జంగయ్య ఆమెను తీసుకుని గత సోమవారం రాత్రి వెంకన్నగూడకు వచ్చాడు. మరుసటి రోజు మంగళవారం గ్రామస్తుల సమక్షంలో పంచాయితీ పెట్టినా భర్తతో ఉండేందుకు రజిత అంగీకరించలేదు. దీంతో కక్ష పెంచుకున్న జంగయ్య అదేరోజు రాత్రి రజితను గ్రామ సమీపంలోని ఓ వెంచర్‌లోకి తీసుకెళ్లి చున్నీ మెడకు బిగింగి, తలపై బండరాయితో మోది చంపాడు. అనంతరం నేరుగా వెళ్లి పీఎస్‌లో లొంగిపోయాడు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు వివరాలు సేకరించి, కేసు నమో దు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా హత్యలో మొదటి భార్య ప్రమేయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

కాపురానికి రావడం లేదని..1
1/1

కాపురానికి రావడం లేదని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement