
పంటల నమోదు తప్పనిసరి
దుద్యాల్: రైతులు తప్పనిసరిగా పంట వివరాలు నమోదు చేసుకోవాలని కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్ సూచించారు. బుధవారం దుద్యాల్, పోలేపల్లి, ఈర్లపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న పంట నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు తమ పొలాల్లో పండిస్తున్న పంటల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద తప్పకుండా నమోదు చేయించుకోవాలన్నారు. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఏఈఓ మాణికేశ్వరి, రైతులు రవినాయక్, సంతోష్ పాల్గొన్నారు.
నానో యూరియాతో లాభాలు
కొడంగల్ రూరల్: మండలంలోని రుద్రారంలో బుధవారం గ్రామానికి చెందిన బొందెంపల్లి కిష్టప్ప పొలంలో నానో యూరియాను వ్యవసాయాధికారులు సూచన మేరకు పిచికారీ చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారిణి తులసి రుద్రారం, అంగడిరాయిచూర్ గ్రామాల్లోని పత్తి పంట పొలాలను పరిశీలిస్తూ నానో యూరియా వాడకంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. తక్కువ మోతాదుతో ఎక్కువ పోషక ప్రభావం కల్పిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఈఓలు శ్రీపతిరెడ్డి, పావని, రైతులు పాల్గొన్నారు.
ఏడీఏ శంకర్ రాఽథోడ్