
ఉపాధినిస్తున్న సీతాఫలం
దుద్యాల్: ప్రస్తుత సీజన్‌లో లభించే సీతాఫలం పండ్లను విక్రయించడం ద్వారా గిరిజన మహిళలు ఉపాధి పొందుతున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని సాలిండాపూర్ తండా, బూరాన్‌పూర్ తండాకు చెందిన మహిళలు నిత్యం సీతాఫలం పండ్లను నగరానికి తరలించి విక్రయిస్తున్నారు. ఒక గంప కా యలను రూ.300 వరకు విక్రయిస్తున్నట్లు తెలిపా రు. పండ్లు అయితే మంచి ధర వస్తుందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్ కావడంతో వారు పండ్ల రవాణాకు ఉపయోగించుకుంటున్నా రు. తద్వారా రవాణా ఖర్చులు ఆదా చేస్తున్నారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చి
నగరంలో విక్రయం