
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే
దుద్యాల్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మండల పరిధిలోని లగచర్ల గ్రామానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమార్ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో కలిసి పిటిషన్ నంబర్ 30217ను వేసినట్లు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు ఇతర సామాజికవర్గాలు చేస్తున్న ప్రయత్నాలు సరికాదని హితవు పలికారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమార్