
విధులు బహిష్కరించి నిరసన
సీజేపై దాడి యత్నం దారుణం
తాండూరు టౌన్: నిరసన తెలుపుతున్న న్యాయవాదులు
పరిగి పట్టణంలో ప్రజా సంఘాల నిరసన
అనంతగిరి/తాండూరు టౌన్/కొడంగల్/పరిగి: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్‌పై దాడికి యత్నించిన న్యాయవాది తీరును నిరశిస్తూ జిల్లాలోని అన్ని కోర్టుల్లో మంగళవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. న్యాయవాది వృత్తిలో ఉన్న వ్యక్తి.. చీఫ్ జస్టిస్‌పై దాడికి యత్నించడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అతనిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వికారాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బస్వరాజ్ పటేల్, కొడంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బస్వరాజు, న్యాయవాదులు ఆనంద్, వెంకటయ్యగౌడ్, కె.రాములు, బి.కృష్ణయ్య, కె.రమేష్, భానుప్రసాద్, న్యాయవాది గోపాల్, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నిందితుడిపై చర్యలు తీసుకోవాలి
న్యాయవాదుల డిమాండ్
అన్ని కోర్టుల్లో నిరసన కార్యక్రమాలు

విధులు బహిష్కరించి నిరసన

విధులు బహిష్కరించి నిరసన