
ఆదర్శప్రాయుడు వాల్మీకి మహర్షి
● కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: వాల్మీకి మహర్షి దేశానికి ఆదర్శప్రాయమైన కవి, ఆధ్యాత్మిక గురువుగా నిలిచిచారని, ప్రతి ఒక్కరూ ఆయన్న ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రామాయణాన్ని రచించి సత్యం, ధర్మం, న్యాయం, సేవ వంటి విలువలను సమాజానికి చాటి చెప్పారన్నారు. అనంతరం కొమురంభీం వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్‌ఓ మంగీలాల్, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి మధవరెడ్డి, డీటీడీఓ కమలాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో..
వికారాబాద్ పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ నారాయణరెడ్డి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.