
కొడంగల్‌లోనే కొనసాగించాలి
● మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు తరలించొద్దు
● ఉపాధ్యాయ సంఘాల విన్నపం
కొడంగల్: కొడంగల్‌కు మంజూరైన మెడికల్ కళాశాలను,ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను పట్టణంలోనే కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరారు. మంగళవారం పట్టణంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మా ట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలోని పాత కొడంగల్ గ్రామ శివారులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు గతంలో జి ల్లా ఉన్నతాధికారులు భూమిపూజ చేశారని గుర్తు చేశారు. మండలంలోని ఎరన్‌పల్లి గ్రామ శివారులో మెడికల్ కళాశాల నిర్మాణానికి అక్క డి రైతుల నుంచి భూమి సేకరించారని తెలిపారు. ఇంత చేసిన తర్వాత ఈ భవనాలను లగచర్లకు తరలిస్తున్నారని ప్రచారం జరుగుతోందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. బుధవారం కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.