
స్వస్థ్ నారీ స్వశక్త్‌తో సంపూర్ణ ఆరోగ్యం
డాక్టర్ ప్రియదర్శిని
దౌల్తాబాద్: స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా మహిళలకు పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్ ప్రియదర్శిని అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో చెవి, ముక్కు, గొంతు నొప్పి లక్షణాలున్న 132 మంది మహిళలకు వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈఎన్‌టీ స్పెషలిస్టు వైద్యులు నాగరాజు, సూపర్‌వైజర్ రఫీ, ఏఎన్‌ఎంలు సిబ్బంది ఉన్నారు.
తాండూరు మండలానికి ఏడుగురు జీపీఓలు
తహసీల్దార్ తారాసింగ్
తాండూరు రూరల్: మండలానికి ఏడుగురు గ్రామ పాలన అధికారుల(జీపీఓ)ను నియమిచినట్లు తహసీల్దార్ తారాసింగ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని 22 క్లస్టర్లకు గాను ఏడుగురు విధుల్లో చేరారన్నారు. వ్యర్త తేజస్ నాయక్. ఈడ్గి రాంచంద్రయ్య, బి.కిష్టప్ప, నర్మద, నీరటి వెంకటయ్య, బి.చిన్న నర్సింలు మండలానికి కేటాయించారని వివరించారు. మరో 15 మంది మండలానికి జీపీఓ రావాల్సి ఉందన్నారు. వారందరూ వచ్చిన తర్వాత జీపీఓలకు క్లస్టర్ల వారీగా గ్రామాలు కేటాయిస్తామన్నారు.
దిగుబడి లేకమార్కెట్ వెలవెల!
ధారూరు: వ్యవసాయ ఉత్పత్తులు లేక ధా రూరు మార్కెట్ వెలవెలబోతోంది. మండల వ్యాప్తంగా రైతులు ఈసారి సుమారు వెయ్యి ఎకరాల్లో పెసర, వంద ఎకరాల్లో మినుము సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయంలోనే కురిసిన భారీ వర్షాలకు చేలు పూర్తిగా పాడయ్యాయి. దీంతో దిగుబడులు చేతికందలేదు. రైతులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు మార్కెట్లోకి సరుకు రావడం లేదు. ఏటా ఈసీజన్‌లో వేలాది బస్తాల పెసర, మినుము ఉత్పత్తులు మార్కెట్‌కు తరలివచ్చేవి. పంటలు దెబ్బతినడంతో శనివారం రైతులు లేక మార్కెట్ కళావిహీనంగా కనిపించింది. వ్యాపారులు, అడ్తిదారులు మధ్యాహ్నం వరకే ఇళ్లకు వెళ్లిపోయారు.
బ్రహ్మోత్సవాలకు సిద్ధం
● లక్ష్మి అనంతపద్మనాభ స్వామి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి
● రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం
అనంతగిరి: వికారాబాద్ పట్టణం ఆలంపల్లిలోని శ్రీ లక్ష్మి అనంతపద్మనాభ స్వామి ఆలయంలో సోమవారం నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త పద్మనాభం, ఈఓ నరేందర్ తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో మొదటి రోజు సాయంత్రం 4.30 గంటలకు ధ్వజారోహణంతో ప్రారంభిస్తారని తెలిపారు. నిత్యం ఉదయం స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, అర్చన, పూజలతో పాటు రాత్రి 7 గంటలకు స్వామి వారి వాహన సేవ ఉంటుందని తెలిపారు. మంగళవారం హనుమత్‌వాహనంపై, బుధ వారం ముత్యాలపందిరి, గురువారం శేషవాహనం, శుక్రవారం గరుడ, శనివారం చంద్రప్రభ, ఆదివారం సూర్యవాహన సేవ కొనసాగనున్నాయని వివరించారు. దసరాను పురస్కరించుకుని సాయంత్రం 4 గంటలకు అశ్వవాహన ఊరేగింపు ఉంటుందని తెలిపారు. అనంతరం 5గంటలకు ఆలంపల్లి మైదానంలో రావణదహనం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

స్వస్థ్ నారీ స్వశక్త్‌తో సంపూర్ణ ఆరోగ్యం

స్వస్థ్ నారీ స్వశక్త్‌తో సంపూర్ణ ఆరోగ్యం