
ముర్రుపాలలో వ్యాధి నిరోధక శక్తి
మోమిన్‌పేట: ముర్రు పాలలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు బాబురావు అన్నారు. శనివారం మండల పరిధిలోని కోల్కుందలో పోషణ మాసోత్సవాల్లో భాగంగా చిన్నారు తల్లులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. ప్రతీ తల్లి బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టించాలన్నారు. తల్లి పాలతో బిడ్డకు ఆరు రోగాలు దరిచేరవని వివరించారు. ఆరు నెలల వరకు తల్లి పాలను పట్టాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారం తీసుకుని పోషకాహారలోపం సమస్యలకు దూరంగా ఉండాలని సూచించారు. చిరు ధాన్యాలు, కూరగాయలు పుష్కలంగా తీసుకొవాలని చెప్పారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల సలహాలు, సూచనలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్త గొంగమ్మ, ఆశ వర్కర్లు, చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఎం బాబురావు