
బైక్‌ను ఢీకొట్టిన సిమెంట్ ట్యాంకర్
ధారూరు: బైక్‌ను సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఆశాపురి ఫ్యాక్టరీ వద్ద శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాఘవేందర్ తెలిపిన ప్రకారం.. పెద్దేముట్ మండలం రుక్మాపూర్‌కు చెందిన భానుప్రసాద్ హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. పెద్దల అమవాస్య కోసం బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా సుద్ద ఫ్యాక్టరీ రోడ్డుపై సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.
ద్విచక్ర వాహనదారుడికి గాయాలు