
మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
యాలాల: కాగ్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని సంగెంకుర్దులో కాగ్నా నది నుంచి ఇసుక రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు తమ సిబ్బంది తనిఖీలు చేపట్టగా రెండు ఖాళీ ట్రాక్టర్లు ఇసుక రవాణాకు వెళ్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. అదే సమయంలో దేవనూరు శివారులో తనిఖీలు చేపట్టగా ఇసుక లోడ్‌తో వెళుతున్న ట్రాక్టరును గుర్తించి తనిఖీలు చేయగా ఎటువంటి అనుమతి పత్రాలు లేవు దీంతో ఖాళీ ట్రాక్టర్లను తహసీల్దార్‌కు అప్పగిస్తామని.. లోడ్ ట్రాక్టరుపై నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.