
పగలు రెక్కీ.. రాత్రి చోరీ
షాద్‌నగర్‌రూరల్: మూగజీవాలను అపహరిస్తున్న ముఠాను షాద్‌నగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మంగళవారం ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని సుల్తాన్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఫెరోజ్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి పరిగి పట్టణానికి చెందిన అబ్దుల్ ఖలీం, మహ్మద్ సోహెల్, షేక్ రవూఫ్, మహ్మద్ జమీర్, కర్ణాటక రాష్ట్రం చౌడ్‌గుప్ప జిల్లా కోదంబాల్ గ్రామానికి చెందిన మహ్మద్ ఆరీఫ్, హైదరాబాద్‌లోని పహడీషరీష్‌కు చెందిన షేక్ హసనుద్దీన్, జియాగూడకు చెందిన సాయికిరణ్‌తో స్నేహం ఏర్పడింది. వీరంతా జల్సాలకు అలవాటుపడి చోరీల బాటపట్టారు. ఈ ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి ఉదయం కార్లలో తిరుగుతూ మేకలు, గొర్రెలు ఎక్కడెక్కడ ఉన్నాయో రెక్కీ నిర్వహిస్తారు. రాత్రివేళ వాటిని అపహరించి జియాగూడ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.
82 మేకలు.. 67 గొర్రెల అపహరణ
ఈ ముఠా షాద్‌నగర్‌పరిధిలోని చించోడ్ పటేల్‌కుంట తండాలో ఎనిమిది, పీర్లగూడలో రెండు మేకలు, సోలీపూర్‌లో 21 గొర్రెలు, చౌదరిగూడలో ఎనిమిది మేకలు, పెద్ద ఎల్కిచర్లలో 23 మేకలు, తంగెళ్లపల్లి లో ఎనిమిది మేకలు, వెంకిర్యాలలో ఎనిమిది గొర్రె లు, కుల్కచర్లలో ఎనిమిది గొర్రెలు, పరిగి మండలం నాయికోటివాడలో 12 మేకలు, సుల్తాన్‌పూర్‌లో 30 గొర్రెలు, దోమ మండలం ఉదన్‌రావుపల్లిలో 15 మేకలు, దిర్సంపల్లి తండాలో ఆరు మేకలు దొంగిలించినట్లు తెలిపారు. పీర్లగూడకు చెందిన బొగ్గుల ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక నైపుణ్యం ఆధారంగా నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సీఐ విజయ్‌కుమార్, డీఐ వెంకటేశ్వర్లు, సీసీఎస్ సీఐ పవన్‌కుమార్, ఎస్‌ఐ భూపాల్, అవి నాశ్‌బాబు, శివారెడ్డి, సిబ్బంది కుమార్, మహేందర్, నవీన్, రమేష్, రవి, భీమయ్య, కరుణాకర్, మోహన్‌లాల్, జాకీర్, రాజు, సంతోష్‌లు చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేజించినట్లు తెలిపా రు. వీరికి తగిన రివార్డును అందించనున్నట్లు ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు.
మూగజీవాలు అపహరిస్తున్న ముఠాకు రిమాండ్
రూ.2.62లక్షల నగదు, నాలుగు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ

పగలు రెక్కీ.. రాత్రి చోరీ