
నారాయణపూర్‌లో తాగునీటి ఎద్డడి
పట్టించుకోని పంచాయతీ అధికారులు
తాండూరు రూరల్: మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. గత మూడు రోజుల నుంచి పైపులైన్ సరఫరా చేసే బోరు మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో గ్రామంలో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు కాలనీల్లో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ సమీపంలో ఉన్న నీటి తొట్టె వద్దకు బిందెలతో తరలివచ్చి నీటిని పట్టుకుంటున్నారు. దీనిపై పంచాయతీ అధికారిని వివరణ కోరగా.. నిధులు లేకపోవడంతో బోరు మోటార్లకు మరమ్మతులు చేయించలేదని చెప్పారు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇనుప సామగ్రి చోరీపై ఫిర్యాదు
కొడంగల్: పట్టణంలోని బాలాజీ కేజీ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో 13వ తేదీన రాత్రి దొంగతనం జరిగిందని పాఠశాల కార్యదర్శి జయతీర్థాచారీ, ప్రధానోపాధ్యాయుడు వెంకటప్పలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు తాళం వేసిన గేటును, రోడ్డు వెడల్పు కోసం తీసిన గేటును ఇతర ఇనుప సామగ్రిని చోరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సామగ్రిని తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. పెద్ద గేటు, చిన్న గేటు, రెండు క్వింటాళ్ల ఐరన్ విలువ సుమారు రూ.లక్షన్నర ఉంటుందని వివరించారు.
వైద్యం అందక లేగదూడ మృతి
బంట్వారం: సరైన వైద్యం అందక ఓ లేగదూడ మృత్యువాత పడింది. ఈ సంఘటన ఆదివారం కోట్‌పల్లి మండలంలోని బీరోల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రైతు బాల్‌రాజ్‌కు చెందిన మూడేళ్ల వయసున్న లేగదూడకు 15 రోజుల కిందట వైరస్ వ్యాధి సోకింది. ప్రభుత్వ పశువైద్యం అందకపోవడంతో బాధితుడు ప్రైవేట్‌గా డబ్బులు చెల్లించి చికిత్స చేయిస్తున్నాడు. అయినప్పటికీ సరైన వైద్యం అందకపోవడంతో లేగదూడ చనిపోయింది. రూ.30 వేలకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయారు. గ్రామంలో పశువైద్య ఉపకేంద్రం ఉన్నప్పటికీ సిబ్బంది లేక ఎప్పుడూ మూతపడే ఉంటుందని పేర్కొన్నారు.
హాస్టల్‌కి వెళ్లిన బాలుడి అదృశ్యం
కుల్కచర్ల: ఇంటి నుంచి హాస్టల్‌కు వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమైన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ గ్రామానికి చెందిన నాగచైతన్య(14) తుంకులగడ్డ గురుకుల పాఠశాల(పరిగి)లో 9వ తరగతి చదువుతున్నాడు. కాగ వినాయకచవితికి ఇంటికి వచ్చిన అతడు తిరిగి ఈ నెల 8వ తేదీన హాస్టల్‌కి వెళ్తానని చెప్పి బయలుదేరాడు. కుటుంబసభ్యులు ఆ రోజు సాయంత్రం హాస్టల్‌కి ఫోన్ చేసి సమాచారం అడగ్గా నాగచైతన్య రాలేదని సిబ్బంది పేర్కొంది. దీంతో తెలిసినవారి దగ్గర వెతకగా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ మేరకు ఆదివారం స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
కుక్కల దాడిలో గొర్రె మృతి
తాండూరు రూరల్: కుక్కల దాడిలో ఓ గొర్రె మృతి చెందిన సంఘటన పెద్దేముల్ మండలం రచ్చకట్టతండాలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. తండాకు చెందిన గోబ్రనాయక్ గొర్రెలను మేపుతూ జీవిస్తున్నారు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో తన మందపై కుక్కలు దాడి చేశాయి. ఇందులో ఓ గొర్రె మృతి చెందింది. ప్రభుత్వమే తనని ఆదుకోవాలని బాధితుడు కోరాడు.

నారాయణపూర్‌లో తాగునీటి ఎద్డడి

నారాయణపూర్‌లో తాగునీటి ఎద్డడి

నారాయణపూర్‌లో తాగునీటి ఎద్డడి