
జాగ్రత్తలు పాటించాలి
కొడంగల్ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ఇక్కడ ఆపరేషన్లు కూడా చేస్తున్నాం. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రభుత్వాసుపత్రికి రావాలి. వైద్యులు, వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. దగ్గు, జ్వరం, కడుపు నొప్పి, జలుబు ఇతర లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలి.
– డాక్టర్ చంద్రప్రియ, సూపరింటెండెంట్
●