
పైపులైన్‌కు మరమ్మతులు
ధారూరు: ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై అధికారులు చర్యలు చేపట్టారు. ‘పల్లెల్లో తాగునీటి ఎద్దడి’ అనే శీర్షికతో ఆదివారం సాక్షి దినపత్రికలో పచురితమైన వార్తకు మండలంలోని మున్నూరుసోమారం గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. స్థానిక మాజీ ఎంపీటీసీ రవీందర్ సహకారంతో కార్యదర్శి కిషన్‌నాయక్‌లు తాగునీటిని సరఫరా చేయించారు. పగిలిపోయిన పైపులైన్లకు మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు.
వ్యక్తి అదృశ్యం
బొంరాస్‌పేట: మండల కేంద్రానికి చెందిన పుట్టి నర్సింలు ఈనెల 24న కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పటివరకు తిరిగిరాకపోవడం, ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆయన భార్య వెంకటమ్మ ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాల వెంకటరమణ తెలిపారు.
కోట్‌పల్లి.. అందాల కడలి
ధారూరు: మండలంలోని కోట్‌పల్లి ప్రాజెక్టుకు ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. చుట్టూ పచ్చని చెట్లతో విస్తరించిన అడవిలో సంచరిస్తూ అక్కడే వనభోజనాలు చేశారు. తర్వాత ప్రాజెక్టు అలుగుపై చేరి కేరింతలు కొడుతూ, సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. యువతీ, యువకులు జేకేఎంఆర్ ద్వారా ఏర్పాటు చేసిన కాయకింగ్ బోటింగ్ చేశారు.
జింఖానా క్లబ్ చైర్మన్‌గా శివరామకృష్ణ
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని ది హైదరాబాద్ జింఖానా క్లబ్ చైర్మన్‌గా గూడురు శివరామకృష్ణ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన క్లబ్ ఎన్నికల్లో నాగ కిషోర్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. చైర్మన్‌గా గూడురు శివరామకృష్ణ, వైస్ చైర్మన్‌గా ఎస్.మధుసూదన్‌రెడ్డి, సెక్రటరీగా ఎన్.నాగ కిషోర్, జాయింట్ సెక్రటరీగా వెన్నం అనిల్‌రెడ్డి, ట్రెజరర్‌గా గడ్డిపాటి హరీష్, డైరెక్టర్లుగా కనుమూరి నారాయణరాజు, రఘురామ్, కంజర్ల సదాశివయాదవ్, కంటిపూడి శ్రీనివాస్‌చౌదరి, అత్తలూరి సుధీర్‌కుమార్, రవికుమార్ వడ్లమూడి విజయం సాధించారు.

పైపులైన్‌కు మరమ్మతులు

పైపులైన్‌కు మరమ్మతులు

పైపులైన్‌కు మరమ్మతులు