
150 కిలోల నల్లబెల్లం పట్టివేత
ఆమనగల్లు: నాటుసారా తయారీ కోసం అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటికలను స్వాధీనం చేసుకుని ఒక మహిళను ఆమనగల్లు ఎకై ్సజ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లబెల్లం, పటికలను ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి తరలిస్తున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాద్‌చౌహాన్ ఆధ్వర్యంలో ఎస్‌టీఎఫ్ బృందం, ఎకై ్సజ్ పోలీసులు ఆదివారం ఆమనగల్లు బస్టాండ్‌లో తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన మహిళ వద్ద ఉన్న బస్తాలను తనిఖీ చేయగా 150 కిలోల నల్లబెల్లం, 15 కిలోల పటిక లభ్యమైంది. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని, నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌కు చెందిన ఎల్లమ్మ అనే మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐ తెలిపారు. తనిఖీల్లో ఎస్‌టీఎఫ్ ఎస్‌ఐ బాలరాజు, సిబ్బంది సురేశ్, శ్రీను, శ్రీజ తదితరులు ఉన్నారు.
తరలిస్తే కఠిన చర్యలు
నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, ముడి పదార్థాలు విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ బద్యానాద్‌చౌహాన్ హెచ్చరించారు. దసరా పండుగ నేపథ్యంలో సారా తయారీ కోసం హైదరాబాద్ నుంచి నల్లబెల్లం, విప్పపువ్వు, ఇతర విడి పదార్థాలు తరలిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.
ఆమనగల్లు బస్టాండ్‌లో ఎకై ్సజ్ పోలీసుల సోదాలు