
యూరియా పంపిణీ చేయండి
తాండూరు రూరల్: చేతికి వచ్చిన పంటలు పాడవుతున్నాయని, ఇప్పటికై నా యూరియా అందుబాటులో ఉంచాలని పెద్దేముల్ మండలం బాయిమీది తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వారు స్థానికంగా మాట్లాడుతూ.. గత మూడు రోజుల నుంచి తట్టెపల్లి పీఏసీఎస్ కార్యాలయానికి యూరియా కోసం వెళ్తున్నామన్నారు. అక్కడ మాత్రం స్థానికులకే యూరియా పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చెరుకు, పత్తి, వరి పంటలను సాగు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. తట్టెపల్లి సొసైటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, సీఈఓ చంద్రమౌళిలు స్పందించి తమకు యూరియా అందజేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైతులు మన్యనాయక్, చందర్‌నాయక్, జ్ఞానేశ్వర్, శంకర్‌నాయక్, శంకర్‌చౌహన్, సందీప్‌కుమార్, నరేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
బాయిమీది తండా రైతుల ఆందోళన