
బీసీ నేతకు శుభాకాంక్షల వెల్లువ
తాండూరు టౌన్: బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలను శనివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ మహిళా సంఘం నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్‌చేసి సంబరాలు జరుపుకొన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలోని 25వ వార్డు చిన్నారులకు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ బ్యాగులు, పలకలు పంపిణీ చేశారు. బీసీల అభ్యున్నతి కోసం అహర్నిషలు కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి కృష్ణయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం తాండూరు అధ్యక్షురాలు అనిత, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్‌గౌడ్, నాయకులు షుకూర్, సాయప్ప, వెంకటేశ్, బస్వరాజ్, నర్సమ్మ, మంజుల, విజయలక్ష్మి, జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
తరలివెళ్లిన నాయకులు..
అనంతగిరి: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఆర్.కృష్ణయ్య జన్మదినాన్ని శనివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లిన బీసీ నేతలు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఆర్.కృష్ణ, జిల్లా కార్యదర్శి అనంతయ్య, మల్లేశం, పాండు, పెంటయ్య తదితరులు ఉన్నారు.
ఘనంగా ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు

బీసీ నేతకు శుభాకాంక్షల వెల్లువ