ఘనంగా ‘గురువందనం’ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ‘గురువందనం’

Sep 13 2025 2:32 AM | Updated on Sep 13 2025 7:25 AM

ఘనంగా

ఘనంగా ‘గురువందనం’

తపస్‌ ఆధ్వర్యంలో

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

తాండూరు టౌన్‌: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్‌) ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను గురువందనం అనే కార్యక్రమం పేరుతో తాండూరులో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తపస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు, కోశాధికారి లక్ష్మీకాంతరావు తదితరులు మాట్లాడారు. ఉపాధ్యాయ, విద్యారంగంలో నెలకొని సమస్యల పరిష్కారం కోసం తపస్‌ పోరాటం చేస్తూనే ఉందన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, దేశ హితం కోసం, విద్యార్థి బంగారు భవిష్యత్‌ కోసం నిరంతరం తపించే ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు అంజిరెడ్డి, రాములు, ఆనందం, సుభాష్‌ రెడ్డి, బస్వరాజ్‌, మాణిక్‌ రావు, జనార్ధన్‌ రెడ్డి, నరహరి రెడ్డి, వీరేశం, సంతోష్‌, వినోద్‌, రవి, సిద్రామేశ్వర్‌, అనిల్‌, శ్రీనివాస్‌, సంతోష, శోభ తదితరులు పాల్గొన్నారు.

15, 16 తేదీల్లో

స్పాట్‌ అడ్మిషన్లు

అనంతగిరి: వికారాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 15, 16 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ ప్రొ. పీవీ గీతాలక్ష్మి పట్నాయక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కొడంగల్‌లో..

కొడంగల్‌ రూరల్‌: 2025 –26 విద్యా సంవత్సరానికి రాను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బీఏ ఇంగ్లిష్‌ మీడియంలో 30 సీట్లు, తెలుగు మీడియంలో 76 సీట్లు, బి.కాం కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో 23 సీట్లు, బీఎస్సీ బీజెడ్‌సీ, జీజెడ్‌సీ.ఎస్‌ ఇంగ్లిష్‌ మీడియంలో 31 సీట్లు, తెలుగు మీడియంలో 30 సీట్లు, బీఎస్సీ ఎంపీసీ, ఎంపీసీ.ఎస్‌లో ఇంగ్లిష్‌ మీడియంలో 46సీట్లు, తెలుగు మీడియంలో 50 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు సంబంధిత ధ్రువపత్రాలతో ఈ నెల 15, 16 తేదీల్లో కళాశాలలో సంప్రదించాలన్నారు. రిజర్వేషన్లకు లోబడి అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు.

పరిగి డిగ్రీ కళాశాలలో..

పరిగి: పరిగి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పీట్‌ అడ్మిషన్‌న్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ సునీతాపద్మావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 15,16వ తేదీల్లో హాజరుకావాలని సూచించారు.

స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ జిల్లా కమిటీ ఏర్పాటు

అనంతగిరి: స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ జిల్లా కమిటీని శుక్రవారం ప్రకటించారు. జిల్లా కన్వీనర్‌గా భానూర్‌ మహేందర్‌రెడ్డి, మహిళా కన్వీనర్‌గా సుజాత, పర్యావరణ ప్రముఖ్‌గా ఎల్‌.మహేందర్‌రెడ్డి, ప్రచార ప్రముఖ్‌గా ప్రేంకుమార్‌, కోకన్వీనర్లుగా వెంకట్‌, ఆంజనేయులు, శివశంకర్‌, భానుప్రకాష్‌ను నియమించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాలమూర్‌ విభాగ్‌ సహ కార్యవాహా కెరెళ్లి అనంత్‌రెడ్డి, స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ రాష్ట్ర కో కన్వీనర్‌ ఈశ్వర్‌ జీ, పాలమూర్‌ విభాగ్‌ కన్వీనర్‌ ప్రభాకర్‌రెడ్డి, విభాగ్‌ కుటుంబ ప్రబోధక్‌ ఎలకంటి పురుషోత్తం, వికారాబాద్‌ కన్వీనర్‌ సురేష్‌గౌడ్‌, కృష్ణ, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజ్‌కుమార్‌కు

బంగారు పతకం

పరిగి: పరిగి సబ్‌ జైలు సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌ బంగారు పతకం సాధించారు. నగరంలోని తెలంగాణ పోలీస్‌ అకాడమీలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు జరిగిన 7వ ఆల్‌ ఇండియా ప్రిసన్స్‌ డ్యూటీ మీట్‌ –2025లో ఫస్ట్‌ ఎయిడ్‌ విభాగంలో పాల్గొని బంగారు పతకం గెలుపొందాడు. తెలంగాణ జైళ్ల శాఖ వరుసగా 3వ సారి ఓవరల్‌ ఛాంపియన్‌ షీప్‌ సాధించింది. దేశంలోని 21 రాష్ట్రాలు పాల్గొనగా జాతీయ స్థాయిలో రాజ్‌కుమార్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించారు.

ఘనంగా ‘గురువందనం’ 
1
1/1

ఘనంగా ‘గురువందనం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement