రోడ్డెక్కిన విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన విద్యార్థులు

Sep 13 2025 2:32 AM | Updated on Sep 13 2025 7:25 AM

రోడ్డెక్కిన విద్యార్థులు

రోడ్డెక్కిన విద్యార్థులు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలుచెల్లించాలంటూ భారీ ర్యాలీ తాండూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన మద్దతు పలికిన బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఏబీవీపీ నాయకులు

తాండూరు టౌన్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. ర్యాలీగా వెళ్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు బీజేపీ, ఏబీవీపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్‌ కుమార్‌, బీసీ కమిషన్‌ రాష్ట్ర మాజీ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు చెల్లించడం మరిచి పోయిందని ఎద్దేవా చేశారు. విద్యాశాఖ తన వద్దే పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి విద్యార్థుల బాధలు పట్టడం లేదని ఆరోపించారు. పేద, మధ్య తరగతి, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం పూర్తిగా ఫీజు రీయిబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లపైనే ఆధారపడి చదువుతున్నారని పేర్కొన్నారు. ఏళ్ల తరబడిగా బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలలు మూసి వేసే పరిస్థితి దాపురించిందన్నారు. విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే యోచనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్‌, నాయకులు భద్రేశ్వర్‌, సాహు శ్రీలత, మల్లేశం, బీఆర్‌ఎస్‌ నాయకులు భానుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ కొండాకు వినతి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయించాలని తాండూరు ప్రైవే టు డిగ్రీ కళాశాలల యాజమాన్యం, బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి తాండూరులో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి చెల్లించక పోవడంతో కళాశాలలు మూత పడే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇది పరోక్షంగా ఉన్నత చదువులు చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే నిధులు మంజూరయ్యేలా చూడాలని ఎంపీని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement