
హేయమైన చర్య
ప్రజాస్వామ్యంపై దాడి
ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. రైతాంగ సమస్యలపై జరుగుతున్న ఉద్యమాలను వెలుగులోకి తేవ డం తప్పా..?. ప్రభుత్వం పత్రికలను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే అక్రమ కేసులు పెడుతోంది. ఏపీలో జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.
–బుగ్గప్ప, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు
దాడులు సరికాదు
ఏపీ ప్రభుత్వం పత్రికల గొంతు నొక్కాలని చూస్తోంది. ఇలాంటి వాటిని ఎవరూ హర్షించరు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య. ప్రజల కోసం.. ప్రజాస్వామ్యం కోసం పాటుపడే మీడియా ఎంతో కీలకం. అలాంటి దాన్ని కట్టడి చేయాలని చూడటం సరికాదు.
– ఎండీ ఫరీద్, న్యాయవాది, తాండూరు
పత్రికా స్వేచ్ఛను హరించడమే
సాక్షి దినపత్రిక, ఎడిటర్, జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను వెలుగులోకి తేవడం తప్పా..?. ఇవి ముమ్మాటికీ తప్పుడు కేసులే. ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతు నొక్కాలని చూడటం సరికాదు.
– ముకుంద నాగేష్, టీజేఏసీ చైర్మన్, వికారాబాద్
విలువలు కాలరాయడమే
సాక్షి దినపత్రిక, ఎడిటర్, పాత్రికేయులపై దాడు లు, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమే. ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరూ తప్పుపట్టాల్సిందే. అక్రమ అరెస్టులు, బెదిరింపులు మంచివికాదు. ప్రజాస్వామ్యంలో పత్రికాస్వేచ్ఛ చాలా ప్రధానమైనది. దీన్ని హరించడం మంచి పద్ధతి కాదు. ఆధారాలు లేకుండా కేసులు పెడితే ప్రజల ముందు నిలబడవు.
– ఆర్.మైపాల్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు
సమాజం హర్షించదు
ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం మీడియా స్వేచ్ఛ ను కాలరాస్తోంది. జ ర్నలిస్టుల గొంతు నొక్కడమంటే ప్రజా హక్కులను హరించడమే. నిర్బంధాలు, దాడులతో వాస్తవాలను దాచలేరు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. ఏపీ కూటమి ప్రభుత్వ చర్యలను సమాజం హర్షించదు.
– వై.గీత, ప్రగతిశీల
మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి

హేయమైన చర్య

హేయమైన చర్య

హేయమైన చర్య

హేయమైన చర్య

హేయమైన చర్య