
హామీలన్నీ అమలు చేస్తున్నాం
● ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
● లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత
● ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
కుల్కచర్ల: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం కుల్కచర్ల మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పథకాలు పొందిన ఆనందం ప్రజల్లో కనిపిస్తోందన్నారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, పాంబండ ఆలయ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎంఈఓ హబీబ్ అహ్మద్, చౌడాపూర్ ఎంఈఓ రాంచందర్, పీఆర్టీయూ మండల అధ్యక్ష కార్యదర్శులు రాఘవేందర్ రెడ్డి, బస్వరాజు, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు రమేష్, తపస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, టీజీయూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్యా, కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ముదిరాజ్‌లు ఆర్థికంగా ఎదగాలి
పరిగి: ముదిరాజ్‌లు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రంగాపూర్ సమీపంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్‌ల అభ్యున్నతికి తాను నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని పేర్కొన్నారు. హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉండాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకులు హన్మంతు ముదిరాజ్, ఆంజనేయులు, రామస్వామి, సత్యనారాయణ, సురేందర్, ఏ బ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత స్థానంలో నిలవాలి
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిల వాలని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం పట్టణంలోని నంబర్ వన్ ఉన్నత పాఠశాలలో రూ.7 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుతోందని తెలిపారు. అనంతరం మండలంలోని పేటమాదారం గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎంఈఓ గోపాల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, డీసీసీ ఉపాఽధ్యక్షుడు లాల్‌కృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు కృష్ణ, ఏ బ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.