
వీరనారి చాకలి ఐలమ్మ
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
అనంతగిరి: వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని బుధవారం కలెక్టరేట్‌లోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐలమ్మ చిత్ర పటానికి అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐలమ్మ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్‌ఓ మంగ్లీలాల్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: ఓటరు, పోలింగ్ కేంద్రాల తుది జాబితాను బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్, జెడ్పీ సీఈవో సుధీర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. అభ్యంతరాలను పరిగనలోకి తీసుకొని మార్పులు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 8న తాండూరులో జరిగిన మండల స్థాయి రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశంలో లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించి, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మార్పులు చేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయా కార్యాలయాల్లో పరిశీలించవచ్చని తెలిపారు.
యాలాల: మండలంలోని నాగసముందర్ గ్రామ పరిధిలో గల శివసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఇరిగేషన్ అధికారులు బుధవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాకరవేణి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా విశ్వనాథ్‌పూర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న శివసాగర్ ప్రాజెక్టు కారణంగా వరద నీరు భారీగా నిలుస్తోంది. దీంతో నాగసముందర్ రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఇరిగేషన్, పంచాయతీ రాజ్ అధికారులను బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతాన్ని పరిశీలించి, సమస్య పరిష్కారానికి గల అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ కిష్టయ్య, పీఆర్ డీఈ కృష్ణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి
కుల్కచర్ల: పేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పుట్టపహడ్‌లో గ్రామ కమిటీను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పుట్టపహాడ్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుర్మయ్య, ప్రధాన కార్యదర్శిగా నాగేశ్వర్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా సర్వర్ పాషా, యువజన విభాగం అధ్యక్షుడిగా రాఘవేందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, నాయకులు వెంకట్రాములు, అంజిలయ్య, జలీల్, భరత్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వీరనారి చాకలి ఐలమ్మ

వీరనారి చాకలి ఐలమ్మ

వీరనారి చాకలి ఐలమ్మ