
అప్రమత్తంగా ఉండండి
● పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
● జిల్లా పంచాయతీ అధికారి జయసుధ
దుద్యాల్: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ పీ జయసుధ సూచించారు. బుధవారం మండలంలోని పోలేపల్లి, హకీంపేట్, ఈర్లపల్లి గ్రామాల్లో పర్యటించారు. పోలేపల్లిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును పరిశీలించారు. వ్యాధులు ప్రబలకుండా చూడాలని హకీంపేట్, దుద్యాల్ వైద్యులు వందన, విద్యకు సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధులను పరిశీలించారు. మురుగు కాలువల్లో చెత్తాచెదారం ఉండటాన్ని చూసి వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు. ప్రజలు పంచాయతీ వాహనాల్లోనే చెత్త వేయాలన్నారు. అనంతరం గ్రామంలో దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. ఆ తర్వాత అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. హకీంపేట్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈర్లపల్లి గ్రామంలో పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహేశ్ కుమార్, ఎంపీవో సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు మోహన్, ఆనంద్, సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.