
అమ్మచెరువును అభివృద్ధి చేస్తాం
దౌల్తాబాద్: నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంతో కొడంగల్ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామంలోని అమ్మ చెరువును పరిశీలించారు. ఈ చెరువును మినీ రిజర్వాయర్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఇక్కడ 3 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమైనట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సాగునీటికి ఇబ్బందులు ఉండవని, రైతులు ఆర్థికంగా ఎదగుతారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టారని.. రానున్న మూడున్నర ఏళ్లలో పథకాన్ని పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, నాయకులు శరణయ్య, మాధవరెడ్డి, వెంకట్రామరెడ్డి, సాయిలు, శ్యామరెడ్డి, వెంకట్రాములు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మినీ రిజర్వాయర్‌గా తీర్చిదిద్దుతాం
నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతలతో సస్యశ్యామలం
ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరెడ్డి