
ఆహార భద్రత మన బాధ్యత
బంట్వారం: విద్యార్థులు, చిన్నారులు, గర్భిణులకు నాణ్యమైన భోజనం అందించడం మన బాధ్యత అని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం ఫుడ్ కమిషన్ సభ్యులతో కలిసి కోట్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్ తోపాటు అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పిల్లలు, విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలన్నారు. గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్నారు. అనంతరం కోట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌ఓ లలితాదేవికి సూచించారు. మాతాశిశు సంరక్షణ వివరాల నమోదును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది సేవలను ప్రశంసించారు. అనంతరం గ్రామంలోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. రేషన్ నిల్వలను ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేయాలని డీలర్‌కు సూచించారు. అధికారుల ఫోన్ నంబర్లు బోర్డుపై రాయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఫుడ్ కమిషన్ సభ్యులు భారతి, శారద, ఆనంద్, డీఈఓ రేణుకాదేవి, డీఆర్‌డీఓ శ్రీనివాస్, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, డీఎస్‌ఓ సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్‌కృష్ణ, ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ జగన్నాథ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ డానియల్, మెడికల్ ఆఫీసర్ మేఘన, ఎంఈఓ చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.
స్టాక్ పాయింట్ పరిశీలన
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని పౌరసరఫరాల శాఖ మండల స్టాక్ పాయింట్‌ను బుధవారం రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కమిషన్ సభ్యులు భారతి, శారద, ఆనంద్ సందర్శించారు. ఆయన వెంట డీఆర్డిఏ శ్రీనివాస్, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, ఫుడ్ సెక్యూరిటీ అధికారి జగన్నాథ్ ఉన్నారు. ఉదయం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ వసతి గృహానికి చేరుకున్న శ్రీనివాస్ రెడ్డికి అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ బొకే అందజేసి స్వాగతం పలికారు.
ఫుడ్ సేఫ్టీ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి