
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
● అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి
● డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీందర్‌యాదవ్
దుద్యాల్: సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆనాగ్యో లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీందర్‌యాదవ్ సూచించారు. మండల పరిధిలోని పోలేపల్లిలో కొనసాగుతున్న ప్రభుత్వ మెడికల్ క్యాంపును సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులను అజాగ్రత్త చేయొద్దని తెలిపారు. గ్రామంలో వ్యాధులు ప్రబలుతున్నాయనే సమాచారంతో మూడు రోజుల పాటు మెడికల్ క్యాంప్ నిర్వహించామన్నారు. సుమారు 200 మంది జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతున్నారని స్పష్టంచేశారు. కార్యక్రమంలో డాక్టర్ వందన, విద్య పాల్గొన్నారు.