
ఆలయాల మూసివేత
అనంతగిరి: చంద్రగ్రహనం సందర్భంగా అర్చకులు వికారాబాద్‌లోని పలు ఆలయాలను ఆది వారం మధ్యాహ్నం మూసివేశారు. అనంతగిరిగుట్ట అనంత పద్మనాభ స్వామి ఆలయల తలపులను మధ్యా హ్నం 2గంటలకు మూసివేశారు. సోమవారం ఆలయ శుద్ధి అనంతరం ఉదయం 10 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు.
పాంబండలో రామలింగేశ్వరాలయం
కుల్కచర్ల: చంద్రగ్రహణం నేపథ్యంలో మండల పరిధిలోని గ్రామాల్లో ఆలయాలను మూసివేశారు. బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర ఆలయంలో ఉదయం 10గంటలకు ఆలయ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, అర్చకులు దశరథం ఆధ్వర్యంలో, మందిపల్‌లో ఆలయ అర్చకులు మఠం రాజశేఖర్ ఆలయం గేట్లకు తాళం వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ సంప్రోక్షణ అనంతరం సోమవారం భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.
ఆలయాలకు తాళం
తాండూరు: తాండూరు నియోజవకర్గంలోని ఆలయాలను ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా మూసి వేశారు. పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయం, కాళికాదేవి ఆలయం, రసూల్‌పూర ఆంజనేయ స్వామి దేవాలయం, పాత తాండూరులోని కోటేశ్వర ఆలయం, సీతారాంపేట్ పాండురంగ దేవాలయం, నగరేశ్వర స్వామి దేవాలయం, చంద్రగిరి వెంకటేశ్వర స్వామి ఆలయాల గేట్లు మూసి తాళం వేశారు. సోమవారం ఉదయం 10గంటల తర్వాత భక్తులకు దర్శనం ఉంటుందని చెప్పారు.

ఆలయాల మూసివేత

ఆలయాల మూసివేత