
నాణ్యమైన భోజనం అందించాలి
ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి
పూడూరు: మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని శనివారం ట్రైనీ కలెక్టర్ హర్ష్‌చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అంగన్‌వాడీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీడీపీఓ ప్రశాంతి, సూపర్ వైజర్ కళావతి తదితరులు పాల్గొన్నారు.
ముదిరాజ్‌ల అభ్యున్నతికి కృషి
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: ముదిరాజ్‌ల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి భూమి కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రత్యేక చొరవ తీసుకుని మండలంలోని రంగాపూర్ సమీపంలో ఎకర భూమిని ముదిరాజ్ భనవ నిర్మాణానికి కేటాయిస్తూ కలెక్టర్ నుంచి ప్రొసీడింగ్ మంజూరు చేయించారు. దీంతో శనివారం ఆయన్ను నియోజకవర్గంలోని ముదిరాజ్‌లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముదిరాజ్‌లకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానన్నారు. ముదిరాజ్ భనవ నిర్మాణానికి సైతం నిధులు కేటాయింపునకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కొందుర్గులో క్షుద్ర పూజల కలకలం
కొందుర్గు: మండల కేంద్రంలో క్షుద్ర పూ జలు కలకలం రేపాయి. పెండ్యాల శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి క్షుద్రపూజలు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పరిసర పొలాల రైతులు అక్కడికి వెళ్లిచూడగా పసుపు, కుంకుమలతో అలంకరించి, అగర్‌బత్తీలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి పూజచేయడంతోపాటు కోడిని బలిచ్చినట్లు బయటపడింది. ఈ విషయమై ఎస్‌ఐ రవీందర్ నాయక్‌ను వివరణ కోరగా తమ కు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

నాణ్యమైన భోజనం అందించాలి