
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి కిరణ్
పరిగి: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి బూనేటి కిరణ్ సూచించారు. ప్రవాస్ యోజన–పల్లె పల్లెకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన రాఘవపూర్‌లో యువతతో చాయ్‌పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతీ గ్రామంలో కాషాయ జెండా ఎగుర వేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. గ్రామాల్లో అభివృద్ది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాగుతున్నాయని.. ఇది ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు నీరటి అనసూయ, నియోజకవర్గ కన్వీనర్ నర్సింలు, కేశవులు, రమేశ్, ఆంజనేయులు, మల్లేశ్ పాల్గొన్నారు.
వికారాబాద్‌లో వర్షం
అనంతగిరి: వికారాబాద్‌లో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో వాతావరణమంతా చల్లబడింది. అరగంటకుపైగా కురిసిన వానతో రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది.
మా వారిని విడుదల చేయించండి
పంజగుట్ట: క్షణికావేశంలో నేరాలకు పాల్పడి ఏళ్ల తరబడి జీవిత ఖైదు అనుభవిస్తున్న తమ వారిని క్షమాభిక్ష ప్రసాదించి జైలు జీవితం నుంచి విముక్తి కలిగించాలని జీవిత ఖైదీల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖైదీల కుటుంబ సభ్యులు స్వప్న, బీచుపల్లి షరీఫ్, రాజేష్, అనీల్ కుమార్ మాట్లాడుతూ .. క్షణికావేశంలో చేసిన నేరాలతో జైలు జీవితాన్ని అనుభవిస్తున్న వారి పరిస్థితి ఒకలా ఉంటే వారిపై ఆధారపడ్డ వారి పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. భర్త దూరమై ఒకరు, తండ్రి దూరమైన పిల్లలు, సోదరుడు దూరమై, వృద్ధాప్యంలో ఉన్న వారు కొడుకులను దూరమై నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతాధృక్పథంతో స్పందించి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తమ వారికి క్షమాభిక్ష ప్రసాదించి సాధారణ జీవితాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యకర్తలకు అండగా ఉంటా
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: కార్యర్తలకు నిత్యం అండగా ఉంటానని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రానికి చెందిన దస్తగిరి పటేల్ అనారోగ్యంతో నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ మంగళవారం ఆస్పత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి