
పంటల నమోదు తప్పనిసరి
పెద్దేముల్ ఏఓ పవన్ ప్రీతం
తాండూరు రూరల్: రైతులు తాము సాగు చేసిన పంట వివరాలను నమోదు చేసుకోవాలని పెద్దేముల్ వ్యవసాయ శాఖ అధికారి పవన్ ప్రీతం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంట నమోదు ఆధారంగానే పంటల కొనుగోలు, రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించేందుకు వీలుంటుందన్నారు. ఆయా గ్రామాల ఏఈఓల వద్ద పంట వివరాలు నమోదు చేయించాలని
సూచించారు.
సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు
సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లను అందజేస్తోందని పెద్దేముల్ ఏఓ పవన్ ప్రీతం తెలిపారు. ఆసక్తి గల రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
బొంరాస్‌పేట: రేగడిమైలారంలో జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొని చికిత్స పొందుతున్న విశ్రాంత ఉపా ధ్యాయుడు చిట్టెపు నర్సిరెడ్డి మృతి చెందా రు. గత నెల 26న ద్విచక్రవాహనంపై ప్రధాన కూడలినుంచి రోడ్డు దాటుతుండగా కొడంగల్ వైపు వేగంగా వెళ్తున్న వాహనం వెనకాల నుంచి బలంగా ఢీకొట్టింది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. మంగళవా రం పరిస్థితి విషమించి మృతి చెందారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఆయా పా ర్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
బైక్ ఢీకొని యువకుడి మృతి
పోచారం: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు మృతి చెందిన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చౌదరిగూడలోని సాయిబాబానగర్‌కు చెందిన కొమ్ము వంశీ (21) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి అతను కొర్రెముల్ నుంచి చౌదరిగూడకు వస్తుండగా శ్రీసాయి ఎన్‌క్లేవ్ వద్ద ఎదురుగా వస్తున్న పల్సర్ బైక్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు.