
మెనూ ప్రకారం భోజనం అందించాలి
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. గురువారం వికారాబాద్‌లోని సంగం లక్ష్మీబాయి రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన ట్రైనీ కలెక్టర్ హర్షచౌదరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు విద్యా బోధన ఎలా చెబుతున్నారని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. పరిశుభ్రమైన తాగునీటిని వాడాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్