
శభాష్.. అమృత
దుద్యాల్: ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జనార్దన్ అన్నారు. ఇటీవల మండలంలోని కుదురుమల్ల గ్రామానికి చెందిన రాసూరి అమృత బీఎస్‌ఎఫ్‌లో చేరడంతో గురువారం ఆమెను స్థానిక పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సమ్మ, రాములు దంపతులు వారి కూతురు అమృతను దేశ రక్షణ కోసం పంపడం గొప్ప విషయమన్నారు. అనంతరం అమృత మాట్లాడుతూ.. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సాయప్ప, ఉపాధ్యాయులు వేణుగోపాల్, శ్రీనివాస్, మంజుల, తిరుపతి, శివకుమార్, శ్రీనివాస్, లత, గ్రామస్తులు పాల్గొన్నారు.