
హామీల అమలుకు పోరాటం
మాడ్గుల: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని గురువారం మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మండల కేంద్రంలో భారీ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయాలనికి తరలివెళ్లి డిమాండ్‌లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్లు పెంచాలని, రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పుకొంటుందన్నారు. హామీల అమలుకు ఈ నెల 30 న చలో కొండారెడ్డిపల్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండె హరిప్రసాద్, మండల అధ్యక్షుడు పెద్దయ్య యాదవ్, నాయకులు రామకిషన్, వెంకటేశ్, నర్సింహ, శ్రీను, వెంకన్న, అశోక్, సునీల్, రాజు, భూపేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ కమిషన్ జాతీయ మాజీ సభ్యుడు ఆచారి