
విశ్వనాథం సేవలను మరువలేం
అనంతగిరి: వికారాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత నేత విశ్వనాథం పాత్ర మరువలేమని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. సర్పంచ్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా ప్రజలకు సేవ చేశారని కొనియాడారు. గురువారం వికారాబాద్‌లోని సత్యభారతి గార్డెన్‌లో విశ్వనాథం ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశ్వనాథం 103 సంవత్సరాలు జీవించడంతో పాటు మరో 100 సంవత్సరాలు ప్రజలు చెప్పుకునే మంచి పనులు చేశారన్నారు. నాలుగు సార్లు వికారాబాద్ మేజర్ గ్రామ పంచాయతీకి ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యారంటే ఆషామాషీ కాదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ కిషన్‌నాయక్, నాయకులు బస్వరాజు, రాంచంద్రారెడ్డి, సురేష్, రెడ్యానాయక్ తదితరులు పాలొన్నారు.
స్పీకర్ ప్రసాద్‌కుమార్