
భవన లీకేజీలను అరికట్టండి
అనంతగిరి: వికారాబాద్ పట్టణలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌ను గురువారం కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనశాల, తరగతి గదులను పరిశీలించారు. వర్షాలకు భవనం ఉరుస్తుండటం చూసి వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేయాలని సూచించారు. అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఎండబ్ల్యూఓ రాజేశ్వరి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేష్, ప్రిన్సిపాల్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్