
లక్ష్యాన్ని అధిగమించాలి
అనంతగిరి: ప్రభుత్వ ఆస్పత్రులో ప్రసవాలు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రోగ్రాం ఆఫీసర్లు, వైద్యాధికారులు, ఎంఎల్ హెచ్‌పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ కే లలితాదేవి జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాధి నిరోధక టీకాలు, అసంక్రమిత వ్యాధులు, టీబీ నియంత్రణ కార్యక్రమలపై సమీక్షించారు. పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. జిల్లాలో 87 ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయని, నాణ్యత పాటిస్తూ మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మాతాశిశు మరణాలపై ప్రతి మూడు నెలలకు సమీక్ష చేయాలన్నారు. ఈనెల 11న నులిపురుగుల నివారణ కార్యక్రమం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, అడిషనల్ కలెక్టర్ సుధీర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర యాదవ్, పంచాయతీ రాజ్ ఈఈ ఉమేష్, డాక్టర్ పవిత్ర, వైద్యాధికారులు పాల్గొన్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాల్లోని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంతోపాటు మెనూ ప్రకారం భోజనం అందించాలి కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, వసతి గృహాల వార్డెన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో చేపట్టిన మరమ్మతు పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు తరచూ వైద్య సేవలు అందేలా చొరత తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, ట్రైనీ కలెక్టర్ హార్స్ చౌదరి, డీఆర్‌డీఏ శ్రీనివాస్, సంక్షేమ ఖాఖ జిల్లా అధికారులు కమలాకర్ రెడ్డి, ఉపేందర్, రాజేశ్వరి, వార్డెన్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనేప్రసవాలు జరిగేలా చూడాలి
కలెక్టర్ ప్రతీక్‌జైన్